చట్టం… కారాదు చుట్టం..
నేడు జాతీయ న్యాయ దినోత్సవం

పోలీసులు, న్యాయవాదులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలి. తగిన ఆధారాలతో, సాక్షులతో నేరస్తులను కోర్టులో ప్రవేశపెట్టాలి పోలీసులు.
ఆ సాక్ష్యాలు తారుమారు కాకుండా నేరస్తుల నేరాలు రుజువు లతో సహా న్యాయమూర్తి ముందు నిరూపించాలి న్యాయవాదులు. అప్పుడే న్యాయమూర్తులు తగిన శిక్షలు వేయడానికి కుదురుతుంది.
ఇక రెండవది విచారణ వేగ వంతమవ్వాలి.
మనిషి దైనందిక జీవితం ఎంతో వేగవంతమైనది. కంప్యూటర్ యుగమైంది. అన్నికూడా శరవేగంతో ముందుకుపో తున్నాయి.
విచారణ, సంవత్సరాలు సంవత్సరాలుగా కాకుండా రోజులలో పూర్తిచేస్తే నేరస్తుడి వల్ల బాధింపబడిన వ్యక్తి తాలూకు వాళ్లకు కొంత తృప్తిమిగులుతుంది. ఇక మూడవది న్యాయవ్యవస్థ మారాలి.
మనకుస్వాతంత్య్రం లభించేటప్పటికీ అనగా 15.8.1947 నాటికి మనకుంటూ ఓ రాజ్యాంగం కానీ, న్యాయవ్యవస్థకానీ లేదు. ఆ బ్రిటిష్ వాళ్లు ఆచరించిన రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థనే మనం ఆచరించవలసిన అగత్యం ఉండేది.
అప్పుడు పెద్దలు, మేధా వులు, రాజకీయ నిపుణులు ఆలో చించి, చర్చించుకొని రాజ్యాంగం, న్యాయవ్యవస్థ తక్షణ అవసరం గుర్తించి ప్రభుత్వాన్ని కోరడంతో 29.8.1947 నాడు కేంద్ర ప్రభుత్వం ఓ డ్రాఫ్ట్ కమిటీని నియమించింది.
దీనికి డా. బి.ఆర్ అంబేద్కర్ నాయకుడిగా, మిగిలిన అయిదుగురు సభ్యులు శ్రీ అల్లాడి కుప్పుస్వామి అయ్యంగార్, బియల్ మిట్టల్, మహ్మద్ తాజుద్దిన్, గోపాలస్వామి అయ్యంగార్, డి.పి ఖైతాన్‌లు నియ మించబడ్డారు
.బ్రిటన్, అమెరికా, ఐర్లాండ్, రష్యా, కెనడా, జర్మనీ లాంటి ఎన్నో దేశాల నుండి రాజ్యాంగాలను తెప్పించుకున్నారు.
వాటిని క్షుణ్ణంగా చదివి, విశ్లేషించుకుని మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇక మన న్యాయవ్యవస్థ విషయానికొస్తే చాలా మటుకు అమెరికా రాజ్యాంగం నుండే తీసుకొని రూపొందించడం జరిగింది.
అంటే మన న్యాయవ్యవస్థను రూపొందించుకొని సుమారు 73 సంవత్సరాలు అయింది.
అప్పటికాలంలో మాన వ్ఞల వ్యవహారాలు, గుణగుణాలు,స్థితిగతులు, పరువ్ఞ ప్రతిష్టలు ఎలా ఉండేవి.ఆ కాలంలో ఓ వ్యక్తిని పోలీసు స్టేషన్‌కు రప్పించితే ఎంతో అవమానంగా, అప్రతిష్టంగా భావించేవారు.
ఇక అపరాధిగా నిరూపణ అయి జైలుశిక్ష పూరై, విడుదలై ఇంటికి వస్తే చావలేక, బతకలేక కృంగికృషించి జీవచ్ఛంలాగా ఇంట్లోనే గడిపేవారు.
మరి ఇప్పుడు జైలు కెళ్లినవారు,తొడ కొడుతున్నారు. మీసాలు మెలేస్తు న్నారు.కాలర్లు ఎగరేస్తున్నారు.
ఇక రాజకీయ నాయకులైతే స్వాతంత్య్రసమరయోధుల్లా గర్వంగా ఫీలవుతున్నారు. అందుకే మన న్యాయవ్యవస్థ కూడా కాలానుగుణంగా మారవలసి ఉందా? లేదా? చెప్పండి.
ఒక అపరాధి చేసిన తప్పునే పలుమార్లు చేస్తు న్నాడు. కారణం శిక్షలు సామాన్యంగా ఉండటమే.
మరో కారణం ఏమిటంటే పట్టుబడి జైలులో పెడితే, కొత్త అల్లులకు అత్తగారింట్లో లేనటువంటి సకల సౌకర్యాలు ఉంటున్నాయి.
ఇటువంటి పరిస్థి తుల్లో నేరస్తులు నేరంచేయడానికి ఎందుకు భయపడతారు. బ్రహ్మ మన తలరాత రాస్తాడు. అందుకే ఆయనను విదాత అన్నారు.
పరమశివ్ఞడు పుట్టిన ప్రతిప్రాణికి జీవన విధానం రూపొందిస్తాడు. అందుకే శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు.
ఇక మహా విష్ణువు శాంతిభద్రతల పర్యవేక్షిస్తూ అండగా ఉంటాడు. ఈ ముగ్గురు ఎలాగైతే లోకాన్ని పర్యవేక్షిస్తారో న్యాయం కూడా ముగ్గురిపై ఆధా రపడి ఉంటుంది.
మొదట పోలీసులు నేరస్తున్ని బంధించి ఎఫ్‌ఐ ఆర్ నమోదుచేసి,సాక్షాలతోసహా నేరస్తున్ని కోర్టులో ప్రవేశపెట్టాలి.
అప్పుడు న్యాయవాదులు సాక్షాలను తగిన ఆధారాలతో కోర్టువారికి నిరూపించాలి.అప్పుడు న్యాయమూర్తులు నేరస్తులకు తగిన శిక్షలు సెక్షన్ల ప్రకారం విధిస్తారు.
ఇలా ముగ్గురివల్ల నేరస్తుడికి తగిన శిక్ష పడటమేకాకుండా నేరాలు కూడా తగ్గుతాయి. ఈ మధ్య జరిగిన ‘దిశ సంఘటన దేశం మొత్తం కుదిపేసింది.
నలుగురి నిందితుల ను ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది. చట్టాన్ని చేతిలోకి తీసుకో వడంతప్పే.కాని ఈ చర్యను ప్రజలందరూ మెచ్చుకున్నా హర్షించా రు కూడా.
లేకపోతే ఆ నలుగురి భద్రత, ఆహారం విషయంలో ప్రభుత్వానికి లక్షలు ఖర్చు అయ్యేది.
అంతేకాకుండా శిక్ష నుండి తప్పించుకున్నా ఆశ్చర్యపడవలసిన పనిలేదు. మనదేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
దొంగతనాలు, దోపిడీలు, భూ కబ్జాదారులు, గుండాయిజం, రౌడీయిజం, అత్యాచారాలు, ఆపై హత్యలు, యధేచ్ఛగా జరుగుతున్నాయి.
అక్రమ సంబంధాల విషయమై భార్యభర్తను చంపించడం లేక తానే చంపడం, భర్త భార్యను చంపడం సర్వసాధారణమైనాయి.
రోజు పేపర్లలో ఇవే ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి కూడా. దాదాపుగా పలు నేరాల్లో నేరస్తులు పట్టుబడుతున్నారు.
ముఖ్యంగా మొబైల్‌ఫోన్ ద్వారా. అయినా నేరం చేయడానికి వెనకంజవేయడం లేదు.కాని మనదేశం లో నేరం చేసి కూడా నిరపరాదులుగా బయటపడుతున్నది .
రాజ కీయ నాయకులే.తండ్రులు అధికారంలో ఉంటే కొడుకులు, బంధు మిత్రులు అవినీతికి పాల్పడి కోటాను కోట్లు సంపాదించి జైలుకు వెళ్లి కూడా నిరపరాదులుగా బయటకొస్తున్నారు.
మనదేశంలో ఓ రాజకీయ నాయకుడు పూర్తికాలం శిక్ష అనుభవించిన దాఖలాలు లేవు.
అంతేకాకుండా చాలా మంది రాజకీయనాయకులు కోర్టుల పట్ల గౌరవాన్ని కూడా ప్రదర్శించరు. 1975లో అలహాబాదు హైకోర్టు నాటి ప్రధాని ఇందిర ఎన్నిక చెల్లనేరదని తీర్పుఇచ్చింది.
ఆ తీర్పును కాలదన్ని దేశం మొత్తం ఎమర్జెన్సీ విధించింది.
అంతే కాకుండా ఆమె చర్యను విమర్శించిన వారందరిని, జయప్రకాశ్ నారాయణ వంటి గొప్పనాయకులను జైలులో బంధించింది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికొస్తే ఎన్నికల కమిషనర్ విషయమై హైకోర్టు ఆంధ్రప్రదేశ్ చర్యను తప్పుపట్టింది.
పాత కమిషనరే కొనసాగాలని తీర్పు ఇచ్చింది. ఈ సమస్య ఏవిధంగా ముగుస్తుందో చూడాలి.
ఇలా మనదేశంలో అప్పుడప్పుడు రాష్ట్రా లకు, హైకోర్టులకు మధ్య కోల్డ్‌వార్‌లు నడుస్తూనే ఉంటాయి.
ఆంధ్రప్రదేశలో ఓ యంపి, ఒక మాజీ ఎమ్మెల్యే, కొంత మంది అధికారపార్టీ నాయకులు మొత్తం 49 మంది హైకోర్టు పట్ల అను చిత వ్యాఖ్యలు,విమర్శలు చేసినందుకు నోటీసులు జారీ అయ్యా యి.
ఈ వ్యవహారం కూడా ఎలా ముగుస్తుందో చూడాలి.
ఏది ఏమైనా మనదేశంలో రాజకీయ నేరస్తులకు నేరాలు రుజువ్ఞకావా? శిక్షించబడరా? కరోనా దెబ్బతో ఈ రెండు కేసులు కాస్త మెత్తబడ్డ టున్నాయి.
ఏదిఏమైనా ఇతర నేరస్తులకు శిక్షలు పడ్డట్టుగానే రాజకీయ నేరస్తులకు కూడా శిక్షలు పడాలి. దీనివల్ల మంచి నాయ కులే ఎన్నికవుతారు.
మంచి పాలకులవల్ల మంచి పాలనతో ప్రజ లకు మేలు జరుగుతుంది. ‘వందమంది అపరాధులు తప్పించు కున్నా సరేకాని, ఒక నిరపరాధి కూడా శిక్షించబడకూడదు అనే మాట గాంధీగారు అంటుండేవారు.
ఒక కేసులో పది సంవత్సరా లు విచారణ జరిగి నేరం మోపబడిన వ్యక్తి నిరపరాధిగా తీర్పు వెలువడిందనుకుందాం.
ఆ వ్యక్తి పది సంవత్సరాలు అవరేజ్‌గా నెలకు ఒకసారి విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైతే ఈ పది సంవత్సరాల కాలంలో 120 సార్లు కోర్టుకు హాజరు కావాలి.
కోర్టుకు రానుపోనూ ఎంత ఖర్చు అయిఉంటుంది. లాయర్లకు ఎంత ఫీజు చెల్లించుకోవాలి.
ఈ పది సంవత్సరాలు ఎంత క్షోభ అనుభవించాలి. మొదట్లోనే అపరాధికి వేసే శిక్ష ఇంత ఉండదు కదా!
అందుకే అంటారు ‘కోర్టులో గెలిచినోడు ఓడిపోయినవాడితో సమానం, ఓడిపోయినవాడు చచ్చినోడితో సమానం అని.నేరాలు తగ్గాలంటే ముఖ్యంగా మూడురకాలుగా మనం ఆలోచించాలి.
మొదటిది పోలీసులు, న్యాయవాదులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలి. తగిన ఆధారాలతో, సాక్షులతో నేరస్తులను కోర్టులో ప్రవేశపెట్టాలి పోలీసులు.
ఆ సాక్షాలు తారుమారు కాకుండా నేరస్తుల నేరాలు రుజువ్ఞలతో సహా న్యాయమూర్తి ముందు నిరూపించాలి న్యాయవాదులు.
అప్పుడే న్యాయమూర్తులు తగిన శిక్షలు వేయడానికి కుదురుతుంది. ఇక రెండవది విచారణ వేగ వంతమవ్వాలి. మనిషి దైనందిక జీవితం ఎంతో వేగవంతమైనది. కంప్యూటర్ యుగమైంది.
అన్నికూడా శరవేగంతో ముందుకుపో తున్నాయి. విచారణ, సంవత్సరాలు సంవత్సరాలుగా కాకుండా రోజులలో పూర్తిచేస్తే నేరస్తుడి వల్ల బాధింపబడిన వ్యక్తి తాలూకు వాళ్లకు కొంత తృప్తిమిగులుతుంది.
ఇక మూడవది న్యాయవ్యవస్థ మారాలి.
ఇప్పటి కాలానుగుణంగా శిక్షలు కఠినం అవ్వాలి. నేరం చేసేవాడికి కొంత భయం ఉండాలి. అప్పుడే రెండోసారి నేరం చేయడానికి వెనకడుగువేస్తారు.
సౌదీ అరేబియాలో అత్యాచారం చేసిన వ్యక్తి తలనరికేస్తారు. మరీ ఇంత క్రూరంగా లేకపోయినా కొంత కఠినంగా మాత్రం చేయాలి శిక్షల్ని.
-మునిగంటి శతృఘ్నచారి, (రచయిత: సూపరెండెంట్ (రిటైర్డ్), కో-ఆపరేటివ్ క్రిమినల్ కోర్టు)
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/