వ్యసాయరంగంపై రసాయనిక ఎరువ్ఞల ప్రభావం

Raythu
Raythu

పా తవ్యవసాయ విధానం నుండి ఆధునిక వ్యవసాయ విధానానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1964లో వచ్చిన హరిత విప్లవం వ్యవసాయ విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వ్యవ సాయ విత్తనాలు, కొత్త వరి వంగడాలు, ఉత్పత్తిలో రెట్టింపు వచ్చే విధంగా ఆధునిక పంటల విధానం తీసుకురావడంలో అప్పటి వ్యవసాయ శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగానే నేడు జనాభాకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు.రసాయనిక ఎరువ్ఞల వాడటంతో నేడు కమర్షియల్‌ వ్యవసాయ విధానం రూపాంతరం చెందిం ది.ఇంతకుముందు రైతులు అన్నిరకాల చిరుధాన్యాలను పండించే ఆచారం ఉండేది. కానీ రసాయనిక ఎరువ్ఞలు, రసాయనిక పురుగుమందులు వాడకంలోనికి వచ్చిన తర్వాత కమర్షియల్‌ పంటలపై రైతులు దృష్టిమళ్లింది. ఆధునికంగా పుట్టుకొచ్చిన చీడపీడల నివారణకు పురుగు మందుల వాడకం మొదలు పెట్టారు. చీడపీడలు నశించడం కంటే వాతావరణ కాలుష్యానికి రసాయనిక ఎరువ్ఞలు దోహపడుతున్నాయి. దీనివల్ల భూసారం తగ్గి వీటి ద్వారా చీడపీడలు నశించకుండానే వాటి ప్రభావం పంటలపై తీవ్రంగా ఉంటోంది.తెలంగాణరాష్ట్రం లో 2015-16 సంవత్సరంలో (992 టన్నుల)రసాయనిక మందుల విక్రయాలు జరిగాయి.నాలుగేళ్ల తర్వాత ఈ విక్రయాలు నాలుగువేల 894 టన్నులకు పెరిగింది.నాలుగేళ్లలో 3901 టన్నుల పురుగుమందు లు వాడకం పెరిగింది.దీంతో రైతులు బాగా నష్టపోయారు. భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో ఎక్కువ మంది రైతులు వాణిజ్య పంటలను వేసిన రైతులే ఉన్నారు. పంట నష్టపోవడం, తెచ్చిన అప్పులు తీర్చలేక పంటల కోసం తెచ్చుకున్న పురుగుమందులనే తాగి ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారు. రైతులకు అవగాహన లేకపోవడం వల్ల విచ్చలవిడిగా రసాయనిక పురుగుమందులు వాడడం జరిగింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు సేంద్రీయ వ్యవ సాయ విధానం చేయాలని అధికారులు అక్కడక్కడ వేదిక మీద చెప్తున్నారు.పురుగు మందుల నియంత్రణ నియమావళి 1971కి సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.పురుగుమందల నియంత్రణ చట్టం 1968లో 36వ సెక్షన్‌ కింద ఈ సవరణ చేసింది. దీని ప్రకారం పురుగుమందు దుకాణాలను వ్యవసాయ అధికారులు విధిగా తనిఖీ చేసి గుర్తింపు పొందిన భవిష్య డిగ్రీ లేదా రసాయనిక శాస్త్రం డిగ్రీ ఉత్తీర్ణులైనవారు మాత్రమే పురుగుమందుల విక్రయాలు చేయాలని నిబంధన తీసుకువచ్చా రు. అగ్రికల్చర్‌ లేదా హార్టికల్చర్‌లో డిగ్రీ, డిప్లమా చేసినవారు వీటిని విక్రయించడానికి అర్హులు. అయితే నేడు మార్కెట్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న పురుగు మందుల విక్రయశాలలను తనిఖీలు చేస్తే ఎన్ని మూత పడతాయో చెప్పనవసరం లేదు. ఇది ప్రభుత్వానికి తెలిసిన విషయమే అయినప్పటికీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. వ్యవ సాయశాఖ నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తే చాలా వరకు వ్యవసాయ పంటలపై పురుగుమందుల వాడకం కొంతవరకైనా తగ్గుతుంది.
డాక్టర్‌ ఆర్‌. ఆదిరెట్టి

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/