ప్రజావాక్కు

స్థానిక సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

భిక్షాటన చేసేవారిని ఆదుకోవాలి:- ముచ్కుర్‌ సుమన్‌గౌడ్‌, నిజామాబాద్‌

గుడి, చర్చి, మసీదుల దగ్గర నివాసం ఉండి భిక్షాటన చేస్తున్న వ్యక్తులను వృద్ధులను ప్రభుత్వం ఆదుకోవాలి. వారికి ఆధార్‌ కార్డులు లేవు.

ప్రభుత్వాలు ఇస్తున్న పెన్షన్లు రావు. ప్రభుత్వం పంచే రేషన్‌ కూడా రాదు. కాబట్టి ఈ లాక్‌డౌన్‌, కరోనా సమయంలో అన్నదాన సత్రాలు కూడా పెట్టడం లేదు.

గుడిలకి ప్రజలు ఎవరు ఎక్కువగా రాకపోవడం వలన గుడిల దగ్గర భిక్షాటన చేసేవారు ఆకలిని చంపుకొని పస్తుంలుంటున్నారు. కొందరు ఒక పూట తిండి తిని వారి జీవనం గడుపు తున్నారు.

మరికొందరికి తినడానికి కూడా ఏమీ లేదు. ప్రభుత్వం ఆవాసాలు కల్పించి నివాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించాలి.

వ్యవస్థలపై నమ్మకం కలిగించాలి:-డా.దన్నాన అప్పలనాయుడు, చీపురపల్లి

మనుషులలో ఇగోలు, ఫాల్స్‌ప్రెస్టేజిలు వ్యక్తులకు సమాజానికి కంటకప్రాయంగా తయారవ్ఞతున్నాయి. ఎదుటివారు మాట్లా డిన మాటలను, పనులను సావధానంగా పరిశీలించడం, వినడం అలవాటు చేసుకోవాలి.

అందులో మంచి ఎంతవరకు ఉందో విచక్షణతో ఆలోచించగలగాలి. స్వచ్ఛందసంస్థలోనైనా, ప్రభుత్వ సంస్థలలోనైనా మంచిచెడులలో ప్రజలు వివేచన కలిగి ఉంటారని గుర్తెరగాలి.

న్యాయవ్యవస్థ తీర్పుల విషయా నికొచ్చేసరికి తనకు అనుకూలంగా ఉన్న వాటిని అమలు పరచమన్నుట్లు,సామాన్యులకు కాని, తాత్కాలిక ఉద్యోగులకు కాని అనుకూలంగా వచ్చిన తీర్పులను అమలు పరిచిన దాఖ లాలు లేవు.

మాట్లాడుతున్న మాటలను ఆలోచనతో అదుపు చేసుకుంటే వ్యవస్థపై అందరికి నమ్మకం కలుగుతుంది.

కరాటేను నేర్చుకోవాలి: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

ప్రస్తుతం దేశంలో,రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. అమ్మాయిలు బయటకువెళ్లడమే నేరంగా మారిపోయింది.

ఏ సమయంలో ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి అమ్మాయి కరాటేను కచ్చితంగా నేర్చుకోవాలి.

ప్రస్తుతం కాలేజి, హైస్కూల్‌ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిలు తప్పకుండా కరాటే నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించడం చాలా అవసరం.

దీనిమూలంగా ప్రతి విద్యార్థిని తనను తాను రక్షించుకోగలుగుతుంది. కరాటే ప్రాధాన్యతను గుర్తించి ప్రతి అమ్మాయి కరాటేను నేర్చుకోవాలి.

వారధి మరో కంఠాభరణం:-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

ఆంధ్రప్రదేశ్‌లో కనకదుర్గమ్మవారధి ఆకర్షణ కాగలదు. తెలంగా ణాకు చార్మినార్‌, రాయలసీమకు కొండారెడ్డి బురుజు కీర్తిగ డించగలదు.

రవాణా,పర్యాటక సొబగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు గతముఖ్యమంత్రి దురాలోచనను అభినందించాలి.

చంద్రబాబు అధికారంలో ఉండగాఏదైనా ప్రాజెక్టును ప్రారం భిస్తుంటే, గత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చెమటోడ్చి ప్రాజెక్టు నిర్మిస్తే లష్కర్‌గా చంద్రబాబు ప్రారంభోత్సవం చేస్తున్నారని అనేకసందర్భాల్లో చంద్రబాబుని అవహేళన చేయడం జరిగింది.

కనకదుర్గమ్మ వారధికి చంద్రబాబు నిధులుమంజూరు చేయించి సిబ్బందితో సర్వాంగసుందరంగా నిర్మించగాజగన్‌ ప్రారంభిస్తు న్నారంటే ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారా? లష్కర్‌ గానా అనేది గుర్తెరగాలి! ఏదిఏమైనా రాష్ట్ర మెడలో మరో కంఠాభరణం!

చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలి: -ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరు జిల్లా

గత ప్రభుత్వాలు ఉదారవైఖరి సరళ వాణిజ్యం, ఆర్థిక విధానాల కారణంగా దేశంలో పెద్దఎత్తున విదేశీ వస్తువులు దిగుమతి అయ్యి ప్రతిఒక్కరి నిత్యజీవితంలో భాగంగామారాయి.

ఇందు వలన లక్షలాదికుటీర,సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలు శాశ్వ తంగా మూతపడ్డాయి.

మన దేశీయకార్మికులుశ్రమించిన వస్తువులకు మార్కెట్‌ లేకుండా పోయింది.నిత్యం ఇంట్లో వినియోగించే వస్తువులలో ఎక్కువశాతం విదేశీవస్తువులే కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ, మధ్యతరగతి పరి శ్రమలకు ఎన్నిప్రోత్సాహకాలుప్రకటిస్తున్నాఫలితం కానరావడం లేదు.

కాబట్టి ప్రతి ఒక్కరు దేశభక్తి అవలంబించుకొని స్వదేశీ వస్తువులనే వినియోగించేలా శపథం తీసుకోవాలి.

దేశీయోత్పత్తి పెరగడం వలన అందరికీ ఉపాధి, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. విదేశీ మోజు వలన విదేశీ మారక ద్రవ్యం నష్టపోవడంతోపాటు విదేశీ కంపెనీలకే మేలు జరుగుతుంది.

కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి:-శ్రీనివాస్‌ చిరిపోతుల, వెంకటేశ్వరపల్లి, భూపాలపల్లి జిల్లా

రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ఆసరా, వితంతు, వికలాంగ పింఛన్‌ లభ్ధిదారులను త్వరిగతిన గుర్తించి వారికి నేటికీ పెన్షన్లు అందడం లేదు.

అధికారులు రీ సర్వే పేరుతో కాలయాపన చేయడం ఏమాత్రం సరికాదు.

వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి భోగస్‌ పెన్షన్లు, భోగస్‌ రేషన్‌ కార్డులను తొలగించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి న్యాయం చేయాలి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/