ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

voice of the people
voice of the people

నిర్లక్ష్య వైఖరే మూలకారణం: -పారేపల్లి సత్యనారాయణ,దేవులపల్లి, ప.గోజిల్లా

భూగోళంలో కరోనా రాక్షసి విలయతాండవం చేస్తోంది. పేద, ధనిక, ఆడ,మగ, కుల,మత, చిన్న,పెద్ద అనే తారతమ్యాలను పక్కనపెట్టి విశృంఖలంగా విజృంభిస్తోంది.

నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాలను, కుగ్రామాలకు సైతం వ్యాపించి వదిలిపెట్టడం లేదు.

ఇప్పటికీ గ్రామాల్లో విండు, వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. భౌతిక దూరాన్ని ఆమడదూరంలో ఉంచుతూ అనవసర ప్రయాణాలు ఆపటం లేదు. ప్రజలు కనీస కొవిడ్‌ నిబంధనలు పాటించని సందర్భాలూ అనేకం.

మొదట్లో ఉన్నంత భయం ఇప్పుడు ప్రజలలో కానరాకపోవడమే దేశంలో ఇన్ని పాజిటివ్‌ కేసులు పెరగడానికి ప్రధాన కారణం.

మాస్కులు ధరిస్తూ చేతులుశుభ్రం చేసుకుంటూ పోషకాహారం తీసుకుంటూ భౌతిక దూరాన్ని పాటిస్తూ స్వీయ గృహనిర్బంధం లో ఉంటూ నిర్లక్ష్య వైఖరిని విడనాడినప్పుడే ఈ కరోనా వైరస్‌ బారిన పడకుండా ఎవరినివారు కాపాడుకోగలుగుతారు.

ఏమిచ్చి తీర్చుకోవాలి మీ రుణం: -సింగంపల్లి శేషసాయికుమార్‌, రాజంపేట

ఒక మహమ్మారి మొత్తం మానవ జాతిని పట్టిపీడిస్తోంటే, మన అనుకొన్న వాళ్లు అందరూ ఒక్కొక్కరుగా దూరం అవ్ఞతుంటే దగ్గరుండి ఆస్పత్రిలోచేర్చి వెంటనుండి వెన్నుతట్టే వైద్యసిబ్బం దికి మనం ‘ఏమిచ్చి తీర్చుకోవాలి రుణం అని అనిపిస్తుంటుంది.

నిజంగా ఎంతటిగుండెధైర్యంకావాలి.వైరస్‌ ఒక విషకణికలా నిన్ను,నన్ను తేడా చూడక మింగేస్తుందని తెలిసినా కూడా దగ్గరుండి చేయిపట్టుకుని నాడిచూస్తారు.

వారే లేకపోతే ప్రపం చంఎంతటి ధైర్యాన్ని కోల్పోయేదో కదా. అని అనిపించకమానదు.

డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది, పారిశుద్ధ్యం కార్మికుల కష్టం చూస్తుంటే మనం చేసేది ఎంత అని అనిపించక మానదు. అటువంటి వైద్యసిబ్బంది అందరికీ ఈ లోకం సదా రుణపడి వారి మర్యాదకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూడాలి.

ఉపాధి కోల్పోయిన ప్రైవేట్‌ ఉపాధ్యాయులు:-సయ్యద్‌షఫీ, హన్మకొండ

గురువంటే చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించేవారు. కొవిడ్‌కారణంగా ప్రైవేట్‌పాఠశాలలలో పనిచేసే ఉపాధ్యాయు లు ఉపాధిని కోల్పోయారు.

ఉపాధి కాకుండా ఉన్నత విద్యను అందించి ఉజ్వలభవిష్యత్తును తయారు చేసి సమాజానికి అం కితం చేసే గురువ్ఞలు నిరుద్యోగులుగా మారి ఏమి చేయాలో తోచక బతుకు బండిని ఎలా లాగాలో తెలియక సతమతమవుతున్నారు. ఇది ఒక భయంకరమైన సమస్యగా తయారైంది.

రైతుల కష్టాలు తీరేనా?:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

ప్రతి గ్రామంలో రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొన్న అవస్థలకు స్వస్తి పలుకుతూ దేశంలో తొలిసారిగా రాష్ట్రప్రభుత్వం ఉరూరా పంటకల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం హర్షణీయం.

వానా కాలం ధాన్యందిగుబడులు మార్కెట్లోకి వచ్చే నాటికి వీటి నిర్మా ణం పూర్తయితే వర్షాలకు ధన్యంతోపాటు ఇతర దిగుబడులు పాడయ్యే ప్రమాదం తగ్గుతుంది.

గ్రామాలలో ప్రభుత్వ ఖర్చుల తోనే పంట కల్లాలను నిర్మించి రైతులకు వెసులుబాటు కల్పిం చేందుకు ప్రభుత్వం 120 కోట్లు విడుదల చేసింది.

అంతేకాకుం డా రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేషనల్‌ రూరల్‌లైవ్‌లీహుడ్‌ మిషన్‌ కింద సేంద్రియ ఎరువ్ఞల తయారీకి 30 శాతం ప్రోత్సా హకాలు అందించాలన్న పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం హర్షణీయం.

గృహ నిర్బంధమే ముఖ్యం:-డా.దన్నాన అప్పలనాయుడు, పార్వతీపురం

ఏదో ఒక పని పెట్టుకొని స్నేహితులతో కలిసి బయట ఇష్టం వచ్చినట్టు అదేపనిగా తిరుగుతూ ఉంటే మనం తిండి విషయం లోగాని, శుభ్రత విషయంలో కాని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం సున్నా.

కరోనా వచ్చి తీరుతుంది. ఉదాహరణకు తమిళ్‌వాళ్లు మిరియాలు రోజూ వాడుతారు,

రోజూ సాంబర్‌ తింటారు.సాంబర్‌లో అన్నిమసాలాలు ఉంటాయి. అల్లం లేకుం డా టీ తాగడం అనేది మరాఠీవాళ్లకి తెలియదు.

ఎక్కువగా చాట్‌మసాలాలు తింటారు.అలాగే ముస్లింలు రోజూ తినే బిర్యా నిలోఅల్లంవెల్లులి,పసుపుమసాలాలులేకుండా ఉండదు.

కరోనా నివారణ ఆహారపదార్థాలు తీసుకుంటున్న పై ప్రాంతాల ప్రజలే ఎక్కువకరోనా వ్యాధికిగురవ్ఞతున్నారు. కారణమేమంటే సామా జికదూరం పాటించకుండా చీటికి మాటికి వీధులలో తిరగడమే.

ప్రభుత్వం స్పందించాలి: -పూసాల సత్యనారాయణ, హైదరాబాద్‌

మహమ్మారి కరోనాకు కళ్లెం వేయడానికి ముందు వరుసలో ఉండిపోరాడిన వారిలో కొంత మంది రాలిపోతూనే ఉన్నారు.

వైద్య, పోలీసు సిబ్బంది మున్సిపాలిటీ కార్మికులు సంక్షేమం చూడాల్సిన బాధ్యత, నైతిక ధైర్యాన్ని ఇచ్చే బాధ్యత ప్రభుత్వా నిదే.

గాంధీ ఆస్పత్రిలో కరోనా కాటుకు బలి అయిన రోగి శవం దుర్గంధంవెదజల్లినా, తోటి కరోనా బాధితులకు ఇబ్బంది కలిగించినా అధికారులు స్పందించినతీరు,మానవత్వం మంట కలుపుతున్న రీతి శోచనీయం.

మంత్రుల పర్యవేక్షణ బూడిదలో పోసినపన్నీరేనా! దీనిపైప్రభుత్వం వెంటనే చర్యలుతీసుకోవాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/