రైతుల్ని పొట్టన పెట్టుకున్న పాపం ఊరికేపోదు

nara lokesh
nara lokesh

అమరావతి: టిడిపి ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. రైతుల్ని పొట్టన పెట్టుకున్నపాపం ఊరికే పోదు వైఎస్‌ జగన్‌గారు అని నారా లోకేష్‌ విమర్శించారు. సీఎం జగన్‌ అనాలోచిత నిర్ణయాల వలన రైతులు బలైపోతున్నారని దుయ్యబట్టారు. రాజధాని తరలిపోతుందన్న ఆందోళనతో అనంతవరం గ్రామానికి చెందిన రైతు పిచ్చయ్య మృతి చెందాడని అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు టిడిపి పార్టీ పోరాటం చేస్తుందని లోకేష్‌ స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/