ప్రతిపక్షాలను తోడేళ్ల గుంపుతో పోల్చిన విజయసాయి రెడ్డి

ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ ..పవన్ కళ్యాణ్ పొత్తు ఫిక్స్ చేయడం..రాజకీయాలను మరింత కాకరేపాయి. ఈ తరుణంలో వైసీపీ దూకుడు కనపరుస్తుంది. పొత్తు ఫై వరుసగా నేతలు విమర్శలు చేస్తూ వస్తుంది.

తాజాగా ప్రతిపక్షాలను తోడేళ్ల గుంపుతో పోల్చాడు ఎంపీ విజయసాయి రెడ్డి. వచ్చే ఎన్నికలు టీడీపీ, వైసీపీ మధ్య జరగనున్నాయని… తోడేళ్ల గుంపుకు, ఒక సింహానికి మధ్య జరగబోతున్న ఎన్నికలని ఆయన అన్నారు. అధికారం కోసం పరితపిస్తున్న వారికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న వారికి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. యూటర్న్ రాజకీయాలు – విశ్వసనీయత, అవకాశవాదం – నిజాయతీ, కుల రాజకీయాలు – ఐకమత్యం, క్యాపిటలిజం – అందరికీ లబ్ధి, అన్ని ప్రతిపక్ష పార్టీలు – సీఎం జగన్ నాయకత్వంలోని ఏపీ ప్రజలకు మధ్య జరగబోతున్న ఎన్నికలని అభివర్ణించారు.