నేటితో 8 వ రోజుకు చేరిన లోకేష్ పాదయాత్ర

నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర నేటితో 8 వ రోజుకు చేరింది. లోకేష్ పాదయాత్ర కు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు. ప్రతి ఒక్కర్ని పలకరిస్తూ వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటూ లోకేష్ ముందుకెళ్తున్నారు. శుక్రవారం ఉదయం మొగిలి దేవాలయం సమీపంలోని విడిది కేంద్రం నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలైంది. బలిజపల్లి గ్రామస్తులతో ఆయన భేటీ అయ్యారు. రాత్రికి ఆయన వజ్రాలపురం విడిది కేంద్రంలో బస చేస్తారు. ఇప్పటి వరకు లోకేష్ 88.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించారు. నిన్న లోకేశ్ 16.2 కిలోమీటర్లు నడిచారు.

ఈరోజు పాదయాత్ర షెడ్యూల్ ఇలా ఉంది.

ఉదయం 9.00 గంటలకు మొగిలి దేవాలయం సమీపంలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం
10.15 గంటలకు బలిజపల్లి గ్రామస్తులతో భేటీ
11.40 గంటలకు శేషాపురంలో మహిళలతో ముఖాముఖి
12.50 గంటలకు వెంకటగిరిలో భోజన విరామం
సాయంత్రం 3.50 గంటలకు వెంకటగిరి నుంచి పాదయాత్ర ప్రారంభం
4.35 గంటలకు వెంకటగిరి జామియా మసీదులో ప్రార్థనలు
5.00 గంటలకు బంగారుపల్లి జంక్షన్ లో బహిరంగసభ
7.45 గంటకు వజ్రాలపురం విడిది కేంద్రం విడిది కేంద్రంలో బస.