కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా

వ్యవసాయ బిల్లును వ్యతిరేకించిన శిరోమణి అకాళీదళ్

Union Minister Harsimrat Kaur Badal

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన వ్యవసాయ సంబంధిత బిల్లులు ఎన్డీయే కూటమిలో చిచ్చును రాజేశాయి. ఈ బిల్లుల్లో పలు అంశాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, వ్యవసాయ రంగాన్ని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసేలా ఉన్నాయని కూటమిలో భాగస్వామి అయిన శిరోమణి అకాళీదళ్ అభిప్రాయపడింది. అంతేకాదు బిల్లును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సభ్యురాలు హర్ సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్ సభలో ఈ బిల్లులు ఓటింగ్ కు వెళ్లే ముందు ఆమె రాజీనామా చేశారు. ప్రధాని కార్యాలయంలో తన రాజీనామాను అందించారు. ఈ సందర్భంగా ఆమె భర్త, పార్టీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వానికి తాము వెలుపలి నుంచి మద్దతును ఇస్తామని… ఇదే సమయంలో రైతుల వ్యతిరేక విధానాలను మాత్రం తాము వ్యతిరేకిస్తామని చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/