యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్న గవర్నర్

ts-governor-tamilisai-soundararajan-visits-yadagirigutta-sri-lakshmi-narasimha-swamy-temple

యాదాద్రి: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నేడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం కొండపైకి చేరుకున్న గవర్నర్‌కు కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయం వద్ద ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేరుగా స్వయంభు ఆలయంలోకి వెళ్లిన గవర్నర్.. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు గవర్నర్‌కు ఆశీర్వచనం చేశారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.