జగన్ చర్య ను తుగ్లక్ చర్య గా అభివర్ణించిన నారా లోకేష్

మూడు రాజధానుల బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును ఉపసంహరించుకుంటూ అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటించారు. మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తూ, మళ్లీ సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తానని వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు లో ఉన్న లోపాలను సరిదిద్ది, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా సమగ్రంగా బిల్లును రూపొందించి అసెంబ్లీలో ప్రవేశ పెడతామని, ప్రస్తుతం చేస్తున్న రద్దు తాత్కాలిక రద్దు మాత్రమేనని జగన్ తేల్చి చెప్పాడు.

ఈ ప్రకటన పట్ల తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు జగన్ ప్రకటన ఫై స్పందించగా..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తుగ్లక్ 3.0 అంటూ అభివర్ణించారు. మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అవుతుందని ఆయన తేల్చి చెప్పారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేసారని లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ తాజా ప్రకటనపై నిప్పులు చెరిగారు.

లోకేష్ ట్వీట్ చేస్తూ .. ‘తుగ్లక్ 3.0! మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేసారు. ఇళ్లు ఇక్కడే కట్టా అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి మూడు రాజధానులు చెయ్యమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని.”అంటూ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.