మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

Parliament

న్యూఢిల్లీః పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ఈ నెల 29 వరకు సమావేశాలు జరుగనున్నాయి. మొత్తం 17 రోజుల పాటు ఉభయ సభల్లో సభా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా 16 కొత్త బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. వాటిలో బయోలాజికల్‌ డైవర్సిటీ, మల్టీ-స్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీలు, ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు, నేషనల్‌ డెంటల్‌ కమిషన్‌, నేషనల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కమిషన్‌ బిల్లు, కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ బిల్లు, అటవీ సంరక్షణ చట్ట సవరణ వంటి బిల్లులు ఉన్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/