సమంత బాటలోనే మరో హీరోయిన్ విడాకులు తీసుకోబోతుందా..?

ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య – సమంతలు ఈ మధ్యనే విడాకులు తీసుకొన్న సంగతి తెలిసిందే. ఈ విడాకుల వార్త అభిమానులను బాధపెట్టినప్పటికీ..వారు మాత్రం సంతోషంగా విడిపోయారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు బిజీ అవుతున్నారు. ఇక ఇప్పుడు సమంత బాటలోనే మరో హీరోయిన్ విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరంటే ప్రియాంక చోప్రా.

హాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు అమెరికాకు వెళ్లిన ప్రియాంక చోప్రా సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది. తన కంటే చిన్నవాడైనా నిక్‌తో పీకల్లోతు ప్రేమలో పడి ఆ తర్వాత రాజస్థాన్‌లో హిందూ సంప్రదాయ పద్దతిలో నిక్ జోనస్‌ను ప్రియాంక పెళ్లి చేసుకొన్నది. 2018 డిసెంబర్ 1వ తేదీన అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది

నిక్ జోనస్‌తో మూడేళ్ల వైవాహిక జీవితం సాఫీగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఓ వార్త బయటకు వచ్చింది.ఎంతో అన్యోన్యంగా కనిపించిన వారి జీవితాల్లో విభేధాలు నెలకొన్నాయని ప్రచారం జరుగుతుంది. ప్రియాంక చోప్రా పెళ్లి తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరును ప్రియాంక చోప్రా జోనస్‌గా మార్చేసుకొన్నది. అప్పటి నుంచి ఆమె ప్రియాంక చోప్రా జోనస్‌గా మీడియాలో పాపులర్ అయ్యారు. అయితే ఇటీవల తన ఇన్స్‌టాగ్రామ్‌లో తన పేరు నుంచి జోనస్‌ను తొలగించడంతో..వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తల్లో నిజం ఉందని అంత మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగానే వీరు విడిపోతున్నారా..లేక ఈ వార్త జస్ట్ పుకారేనా అనేది చూడాలి.