చిత్తూరు క‌లెక్ట‌ర్‌కు చంద్ర‌బాబు లేఖ‌

పూత‌ల ప‌ట్టు మండ‌లం పాల‌కూరులో భూఆక్ర‌మ‌ణ‌లపై లేఖ‌

అమరావతి: టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చిత్తూరు జిల్లా క‌లెక్ట‌ర్‌కు లేఖ రాశారు. పూత‌ల ప‌ట్టు మండ‌లం పాల‌కూరులో భూఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతున్నాయంటూ, వైస్సార్సీపీ నేత‌లే భూ ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు. చివ‌ర‌కు పాఠ‌శాల మైదాన స్థలాన్నీ ఆక్ర‌మించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.

గుడిసెలు, నిర్మాణాల‌తో ఆక్ర‌మ‌ణ‌ల‌కు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నార‌ని చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. ఆక్ర‌మ‌ణదారుల‌పై చ‌ట్ట‌బద్ధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్‌ను ఆయ‌న కోరారు. పూత‌ల ప‌ట్టు మండ‌లం పాల‌కూరులో భూఆక్ర‌మ‌ణ‌లపై ప‌లు అంశాల‌ను చంద్ర‌బాబు ఈ లేఖ‌లో వివ‌రించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/