నేడు 168 రైళ్లు రద్దు.. మరికొన్ని దారిమళ్లింపుః రైల్వే శాఖ

trains

న్యూఢిల్లీః దేశంలో నేడు పలు రైల్వే సర్వీసులు రద్దవుతున్నాయి. సోమవారం 140కిపైగా రైళ్లను రద్దుచేసిన రైల్వే శాఖ.. తాజా మరో 168 ట్రైన్స్‌ను క్యాన్సల్‌ చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా 168 రైళ్లను రద్దుచేస్తూ ఇండియన్‌ రైల్వేస్‌ క్యాటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (IRCTC) నిర్ణయించింది. ఇందులో 124 ట్రైన్స్‌ను పూర్తిగా రద్దుచేస్తున్నామని, 44 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. మరో 14 రైళ్లను దారి మళ్లిస్తున్నామని, ఎనిమిది ట్రైన్లు రీషెడ్యూల్‌ చేస్తున్నామని వెల్లడించింది. భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల కారణంగా రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరిస్తున్నామని తెలిపింది. అక్టోబర్‌ 13న కూడా భారీ సంఖ్యలో రైళ్లు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి.

రద్దయిన రైళ్లలో ఎక్కువగా పుణె, సతారా, బటిండా, ఫఠాన్‌కోట్‌, లక్నో, గోండా, గోరఖ్‌పూర్‌, న్యూఢిల్లీ, వడోదరా, రత్నగిరి, వారణాసి, కాన్పూర్‌ సెంట్రల్‌, సీతాపూర్‌, ఆనంద్‌ విహార్‌ జంక్షన్‌, అమృత్‌సర్‌ జంక్షన్‌, ఘజియాబాద్‌ వంటి నగరాలకు వెళ్లాల్సినవే ఉన్నాయి. అందువల్ల ప్రయాణికులు ట్రైన్‌ షెడ్యూల్స్‌ను చెక్‌ చేసుకుని ప్రయాణాలు ప్రారంభించాలని అధికారులు కోరారు. కాగా, రద్దయిన రైళ్లకు సంబంధించి ముందుగానే టికెట్లు బుక్‌చేసుకున్నవారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/