కొండగట్టుకు చేరుకున్న పవన్‌కల్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారం కోసం వారాహి పేరుతో వాహనాన్ని సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వాహనానికి సంబదించిన పూజా కార్యక్రమాలు ఈరోజు కొండగట్టులో జరపనున్నారు. ఇందుకు గాను పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం హైదరాబాద్ నుండి కొండగట్టు అంజన్న ఆలయం కు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ కు అభిమానులు , జనసేన కార్య కర్తలు పెద్ద ఎత్తున నీరాజనాలు పలికారు. పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వస్తారని గత వారం రోజుల నుండే ప్రచారం జరగడం తో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు వేలాదిమంది అభిమానులు కొండగట్టుకు చేరుకున్నారు. ఉదయం నుండి కూడా వాహనాలను కొండపైకి అనుమతి ఇవ్వడం లేదు. పోలీసులు సైతం పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో పూజా కార్య క్రమాలు పూర్తి కానున్నాయి.

మధ్యాహ్నం 1 గంటలకు నాచుపల్లి శివార్లలోని బృందావన్ రిసార్టులో తెలంగాణకు చెందిన పార్టీ ముఖ్యులతో భేటీ అవుతారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అనుసరించాల్సిన వ్యూహాలపైన వారితో చర్చిస్తారు. సాయంత్రం 4 గంటలకు ధర్మపురి చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడి నుంచే అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ను మొదలుపెడతారు. సాయంత్రం 5:30 గంటలకు పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు పవన్ కళ్యాణ్.