ములాయం సింగ్ మృతిపై యూపీలో మూడు రోజుల సంతాప దినాలు

mulayam singh yadav
mulayam singh yadav

ల‌క్నో: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాద‌వ్ ఈరోజు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాలు ప్ర‌క‌టించారు. ములాయం మృతి ప‌ట్ల రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య‌నాథ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. పూర్తి అధికార లాంఛ‌నాల‌తో ములాయం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాద‌వ్‌తో సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఫోన్‌లో మాట్లాడారు. సామాజిక సిద్ధాంతం కోసం ములాయం తుది వ‌ర‌కు పోరాటం చేశార‌ని సీఎం యోగి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. యూపీ స్పీక‌ర్ స‌తీశ్ మ‌హానా కూడా ములాయం మృతి ప‌ట్ల సంతాపం తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/