నేడు సాగర్‌లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్: నేడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. హైదరాబాద్‌ తాగునీటి సరఫరా కోసం సుంకిశాలలో జలమండలి నిర్మించనున్న ఇనెటెక్‌ వెల్‌కు పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 9.45 గంటలకు పెద్దవూర మండలం సుంకిశాలకు చేరుకుంటారు. హైదరాబాద్ నగరానికి త్రాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న ఇన్‌టెక్‌ వెల్‌ పంపింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొంటారు.

ఉదయం 10.45 గంటలకు నందికొండ మున్సిపాలిటీకి చేరుకుని బుద్ధావనం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంభందించిన రూ.56 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం హైదరాబాద్‌ బయలుదేరుతారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/