జగన్ చేసిన నేరాలు ఆంధ్రప్రదేశ్‌కు ఉరివేస్తున్నాయిః లోకేశ్

బాబాయ్ కేసు కోసం పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశాడని ఆరోపణ

nara-lokesh-comments-on-ys-jagan

అమరావతిః సిఎం జగన్‌పై ఎక్స్ వేదికగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. జగన్ చేసిన పాపాలు రాయలసీమకు శాపాలుగా మారుతున్నాయన్నారు. జ‌గ‌న్ చేసిన నేరాలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల‌కి ఉరివేస్తున్నాయన్నారు. అక్ర‌మాస్తుల కేసుల మాఫీ కోసం ప్ర‌త్యేక‌హోదా వ‌దులుకున్నాడని, విశాఖలో రుషికొండకు గుండు కొట్టిన కేసు త‌ప్పించుకునేందుకు విశాఖ రైల్వేజోన్ కి నీళ్లొదిలాడని, బాబాయ్‌ని చంపించిన కేసులో త‌మ్ముడిని ర‌క్షించుకునేందుకు ఏకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడి పోల‌వ‌రం ప్రాజెక్టుని ప్ర‌శ్నార్థ‌కం చేశాడని ఆరోపించారు. రాయ‌ల‌సీమ బిడ్డ‌నంటూ క్యాన్స‌ర్ గ‌డ్డలా పీడిస్తున్నాడన్నారు.

జ‌గ‌న్ ప్రభుత్వం దారుణ వైఫ‌ల్యం వ‌ల్లే కృష్ణాజ‌లాల కేటాయింపులు పునఃస‌మీక్ష జ‌రుగుతోందని పేర్కొన్నారు. ప్ర‌జ‌లారా, జ‌గ‌న్‌కి ఇచ్చిన ఒక్క చాన్స్‌తో ఏమేమి కోల్పోయారో గుర్తించండి, రాయ‌ల‌సీమ సాగు, తాగునీటి అవ‌స‌రాలు తీర్చే కృష్ణాజ‌లాలలో న్యాయ‌బ‌ద్ధ‌మైన వాటా కోల్పోతే, రాయ‌ల‌సీమ ఎడారిగా మారే ప్ర‌మాదం ఉందని హెచ్చరించారు.