దేశ పౌరులకు రాష్ట్రపతి, ప్రధాని క్రిస్మస్‌ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ క్రిస్మస్‌ సందర్భంగా దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్ చేశారు. భారతదేశం, విదేశాలలో ఉన్న పౌరులకు, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సంతోషకరమైన సందర్భంగా న్యాయం, స్వేచ్ఛ విలువలపై ఆధారపడిన సమాజాన్ని నిర్మించాలని సంకల్పిద్దాం. యేసుక్రీస్తు బోధలను మన జీవితంలో అనుసరిద్దాం అంటూ ట్విట్ చేశారు.

క్రిస్‌మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రిస్తు జీవితం, బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కరుణ, ప్రేమ, సేవ, దయ యేసుక్రిస్తు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. యేసు జీవితం, బోధనలను గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుసంపన్నంగా ఆయూరారోగ్యాలతో సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/