విజిల్ వేస్తే పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారిస్తారా..? – లోకేష్ ఫైర్

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా శనివారం టీడీపీ మోత మొగిద్దాం అనే వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని చంద్రబాబు కు సంఘీభావం పలికారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని కొంతమందిని పోలీసులు పోలీస్ స్టేషన్ కు పిలిపించడం ఫై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. విజిల్స్ వేసి సౌండ్ చేశారంటూ 60 మందిపై పోలీసులు కేసులు పెట్టాని టీడీపీ యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు.

వీరి తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూశారని, పసుపు రంగు దుస్తులు వేసుకున్నారని, సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కూడా కేసు పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ‘ఒక పని చేయండి… రాజద్రోహం కేసు పెట్టి ఉరిశిక్ష వేసేయండి’ అని మండిపడ్డారు. జగన్ కు పిచ్చి పీక్స్ లో ఉన్నట్టుందని అన్నారు. కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినోడికి సరే… అమలు చేసినోడి బుద్ధి, బుర్ర ఏమయిందని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.