ఆళ్ల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు

Alla Ramakrishna Reddy
Alla Ramakrishna Reddy

గుంటూరు: వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె ఆళ్ల రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యె ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని వికేంద్రీకణకు మద్దతుగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆయన తాడేపల్లిలో గల సిఎం క్యాంపు కార్యాలయం వరకు నిర్వహించాలని రామకృష్ణారెడ్డి నిర్ణయించారు. అయితే ఈ ర్యాలీ అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. కానీ ఆయన మొండిపట్టుతో ర్యాలీ జరిపే తీరుతానని తెగేసి చెప్పారు. అయితే పోలీసులు రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి పోలీసుల వాహనంలో అక్కడి నుంచి తరలించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/