అవనిగడ్డ వారాహి సభ ఫై మంత్రి అంబటి కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవనిగడ్డలో ఏర్పాటు చేసిన వారాహి సభ అట్టర్ ప్లాప్ అన్నారు వైస్సార్సీపీ మంత్రి అంబటి రాంబాబు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాలుగో విడత వారాహి యాత్రను ప్రారంభించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో జనసేనాని భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ..సీఎం జగన్ కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైందని చెప్పారని, కానీ కౌరవులు వాళ్లేనని, ఓడిపోయేది కూడా వాళ్లేనని పవన్ విమర్శించారు. 100 మందికి పైగా ఉన్న వైసీపీ నేతలే కౌరవులని, కాబట్టి వాళ్లు ఓడిపోవడం ఖాయమన్నారు. ఏపీ భవిష్యత్తు కోసం ఈసారి ఓట్లను చీలనివ్వమని, వైసీపీని దించేయడమే తమ లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి జనసేన, టీడీపీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపిస్తాయన్నారు.

ఈ కామెంట్స్ ఫై వైస్సార్సీపీ మంత్రి అంబటి ట్విట్టర్ వేదికగా స్పందించారు.వారాహి యాత్ర యువగళం= వరాహగళం… ‘అవనిగడ్డ’ ఫ్లాప్ అయిందని వరాహగళం నిరూపించింది అని వివరించారు. 1 ప్లస్ 1=2 అనేది గణితంలో వర్తిస్తుందని, కానీ రాజకీయాల్లో కొన్నిసార్లు 1 ప్లస్ 1=0 అవుతుందని ఎద్దేవా చేశారు.