‘మైఖేల్’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హీరో నాని

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. ఫిబ్రవరి 03 న పలు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా రేపు ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో అట్టహాసంగా జరగబోతుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా నేచురల్ స్టార్ నాని హాజరుకాబోతున్నారు.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో హీరోగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన సందీప్..మొదటి మూవీ తోనే సూపర్ హిట్ అందుకొని వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత వరుస గా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు కానీ పెద్దగా విజయం అందుకోలేకపోయారు. ఇటీవల కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు పాన్ ఇండియా మూవీ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఫిబ్రవరి 03 న ఈ మూవీ రాబోతుంది.

రంజిత్ జయకోడి డైరెక్ట్ చేయగా..విజయ్‌ సేతుపతి, గౌతమ్ మేనన్, వరుణ్ సందేశ్ ,వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సందీప్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్‌ నటించింది. ఈ చిత్ర ట్రైలర్ చూస్తే యాక్షన్ తో పాటు సందీప్, దివ్యాంశ మధ్య లవ్, ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి ఈ మూవీ తో సందీప్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.