అట్టహాసంగా పవన్ – సుజిత్ మూవీ ఓపెనింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలను సెట్స్ పైకి తీసుకెళ్తు అభిమానుల్లో ఆనందం నింపుతున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ జరుపుకుంటుండగా..హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ ను సెట్స్ పైకి తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్లో మరో మూవీ కి శ్రీకారం చుట్టారు. ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోయే ఈ చిత్ర ఓపెనింగ్ కార్య క్రమాలు ఈరోజు సోమవారం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు.. అల్లు అరవింద్.. సురేష్ బాబు ఇంకా పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. బ్లాక్ అండ్ బ్లాక్ లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో పాటు స్టైలిష్ ఔట్ ఫిట్ తో పవన్ కళ్యాణ్ ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించిన విషయాలను త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు.. ఇతర విషయాలు ఏంటీ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మ్యూజిక్ మాత్రం థమన్ అందించబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వేడుక లో థమన్ కూడా హాజరుకావడంతో ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అని అంత అంటున్నారు.