ఎంఆర్ శామ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మధ్య శ్రేణి ఎంఆర్ శామ్ క్షిపణిని భారత నేవీ విజయవంతంగా పరీక్షించింది. వైజాగ్​లోని ఐఎన్​ఎస్ ​యుద్ధనౌక నుంచి ఇండియన్​ నేవీ.. మీడియం రేంజ్ ​మిస్సైల్​ను ఆకాశంలోకి పంపింది. ఎంఆర్​ఎస్​ఏఎం క్షిపణులకు యాంటీషిప్​ మిస్సైళ్లను ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ఉందని నేవీ అధికారులు తెలిపారు. డీఆర్డీవో, ఐఏఐ ఉమ్మడిగా ఈ మిస్సైల్​ను అభివృద్ధి చేశాయి. దీన్ని బీడీఎల్ ఉత్పత్తి చేస్తోంది. ఆత్మనిర్భర్ భార‌త్‌కు ఇదే సాక్ష్యమ‌ని ఈరోజు నేవీ ఓ ప్రకటన లో తెలిపింది.

ఎంఆర్ శామ్ క్షిపణి… 70 కిలోమీటర్ల రేంజిలో శత్రుదేశాల యుద్ధ విమానాలను, అటాకింగ్ హెలికాప్టర్లను, క్రూయిజ్ మిస్సైళ్లను, బాంబర్ డ్రోన్లను ఇది తుత్తునియలు చేయగలదు. ఈ అత్యాధునిక క్షిపణిని డీఆర్డీవో, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేయగా, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది.