చంద్రబాబు – పవన్ కళ్యాణ్ ఫై మంత్రి అంబటి రాంబాబు ఫైర్

వైస్సార్సీపీ మంత్రి అంబటి రాంబాబు..తెలుగుదేశం అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశవ్యాప్తంగా ధరలు పెరిగితే అది మేమే పెంచినట్లు చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు మాట్లాడుతున్నారని , చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికంటే ధరలు ఇప్పుడే చౌకగా ఉన్నాయని , దేశంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఈ మూడేళ్లలో ఏర్పడ్డాయి. దీనివల్ల ధరలు పెరగడం, తగ్గడం జరుగుతూ ఉన్నాయని అన్నారు.

చంద్రబాబుకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన శాసనసభకు రావడం లేదంటూ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆనాడు శాసనసభకు రానివారు జీతాలు కూడా తీసుకోకూడదంటూ ప్రగల్భాలు పలికారని గుర్తుచేశారు. మీకు 175 సీట్లలో ప్రజలు బాదుడే బాదుడు చూపించారు. నీ కుమారుని మంగళగిరిలో బాదింది అసలు బాదుడు. జన్మభూమి కమిటీల ద్వారా మీరు చేసింది బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు విరుచుకపడ్డారు. కుప్పంలో నిన్ను తుక్కు తుక్కుగా ఓడించి అసలైన బాదుడు చూపించారని , నీ దత్తపుత్రుడిని రెండు చోట్లా ఓడించి బాదుడు చూపించారని రాంబాబు అన్నారు.