విజయ్ ‘బీస్ట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు

విజయ్ – పూజా హగ్దే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బీస్ట్. విజయ్ సినిమాకు తమిళనాట టాక్‌తో సంబంధం ఉండదు. సినిమా ఎలా ఉన్నా కూడా కలెక్షన్లు మాత్రం అదిరిపోతాయి. అదే విషయం బీస్ట్ సినిమాతో మరోసారి ఫ్రూవ్ అయింది. బీస్ట్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. కానీ ఒక్క తమిళ నాట మాత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా హిందీ , తెలుగు లోను భారీ డిజాస్టర్ అయ్యింది.

ఇదిలా ఉంటె ఈ చిత్ర ఓటిటి రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. ఈ నెల 11 నుంచి ఈ చిత్రం OTT నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుందని పేర్కొన్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ట్విట్టర్ వేదికగా వచ్చిన ఈ ప్రకటన చూసి నెటిజన్లు , తలపతి విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటె ఇటీవల ‘బీస్ట్’ టీమ్ మెంబర్స్ అందిరినీ ఇంటికి పిలిపించి పార్టీ ఇచ్చారు విజయ్. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయ.