అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొన్న నందమూరి హీరో తారకరత్న

అమరావతి రాజధాని కోసం అమరావతి రైతులు గత కొద్దీ రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రకు విశేష స్పందన వస్తుంది. రాజకీయ పార్టీ నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో బుధువారం ఈ పాదయాత్ర లో నందమూరి హీరో తారకరత్న పాల్గొని మద్దతు తెలిపారు.

బుధవారం రాజమహేంద్రవరం రూరల్‌లో 38రోజు ప్రారంభమైన రైతుల మహాపాదయాత్రకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి చినరాజప్పతో పాటూ పలు పార్టీల నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. అలాగే నందమూరి హీరో తారకరత్న రాజమహేంద్రవరం రూరల్‌లో జరిగిన పాదయాత్రలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రైతులతో కలిసి కొంతదూరం పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.