హీరో ఆఫ్ ది ఇయర్ గా సోనూసూద్
యాహూ ప్రకటన

‘హీరో ఆఫ్ ది ఇయర్’ గా హీరో సోనూసూద్ ని యాహూ ప్రకటించింది .
లక్షలాది మంది వలస కార్మికులు లాక్ డౌన్ సమయంలో వారి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న సమయంలో సోనూ సూద్ తన వంతు సాయంగా ముందుకు వచ్చి బస్సులు.. రైళ్లు.. విమానంతో సహా ఎవరికి అవసరం అయిన వాటి ద్వారా వారి గమ్య స్థానాలకు చేర్చారు.
ఈ క్రమంలో ఆయన ఎంతో ఖర్చు చేశారు. వలస కార్మికులు తమ ఇళ్లకు వెళ్తున్న సమయంలో ప్రమాదాలు జరిగి మృతి చెందితే వారి కుటుంబాలను కూడా ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు.
ఇక సోషల్ మీడియా ద్వారా ఎవరైనా తనను సాయం అని అడిగితే వెంటనే రెస్పాండ్ అయిన వ్యక్తి సోనూసూద్.
అందుకే హీరో ఆఫ్ ది ఇయర్ సోనూ సూద్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ యహూ ప్రకటించడం విశేషం.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/