టీడీపీ లో చేరబోతున్నట్లు ప్రకటించిన నిర్మాత నట్టి కుమార్

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో వలసల పర్వం ఎక్కువైపోతోంది. వైసీపీ పార్టీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తున్నారు. ఇప్పటీకే పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు , జడ్పీటీసీ లు రాజీనామా చేయగా..జనవరి రెండోవారం నాటికీ చాలామంది బయటకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటె మొదటి నుండి వైసీపీ కి , జగన్ కు మద్దతు గా ఉంటూ వస్తున్న నిర్మాత నట్టి కుమార్ సైతం త్వరలో టీడీపీ లో చేరబోతున్నట్లు ప్రకటించారు.

గతంలో సీఎం జగన్ కు తాను సానుభూతి పరుడినని, ఇప్పుడు ఆయన నిర్ణయాలతో విసిగిపోయాయని చెప్పారు. తమ లాంటి వాళ్లను వైసీపీ తన స్వార్థానికి వినియోగించుకుందని ఆరోపించారు. ఎంపీ సత్యనారాయణ విశాఖలో రూ.2 వేల కోట్ల విలువైన చర్చి ఆస్తులను సొంతం చేసుకోబోతున్నారని ఆరోపించారు. ఈ ఆస్తులు అమ్మడానికి, కొనడానికి వీలు లేకపోయినా.. అధికారాన్ని పెట్టుకుని చర్చి భూములను కొట్టేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో తాను టీడీపీ చేరబోతున్నట్లు నట్టి కుమార్ తెలిపారు. చంద్రబాలు ఆలోచనకు పవన్ బలం తోడవుతోందని.. దీంతో జగన్ కు మతి పోయిందని, అందుకే దండయాత్రలు చేయిస్తున్నారని నట్టి కుమార్ పేర్కొన్నారు.