నాంపల్లి కోర్టుకు లష్కరే ఉగ్రవాది.. నేడు తుది తీర్పు

Nampally Court
Nampally Court

హైదరాబాద్‌: లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండా కేసులో నేడు హైదరాబాద్ నాంపల్లి కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. దీంతో తుండాను ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దేశ వ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో తుండా నిందితుడిగా ఉన్నాడు. ఆయా దాడుల తర్వాత కొన్ని రోజుల పాటు పాకిస్తాన్ లో తలదాచుకున్నాడు. దీంతో ఇతన్నిఉ ఏడేళ్లకిందట నేపాల్ సరిహద్దుల్లో కరీంను పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఇతను 1990లో యువకులను ఉగ్రవాదంపై మళ్లించాడు. పిటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకవచ్చింది సిట్. హైదరాబాద్ లో జరిగిన పలు పేలుళ్ల కేసులలో తుండా హస్తం ఉంది. ఈరోజు తుది తీర్పురానుంది. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న తుండాను ఇవాళ హైదరాబాద్‌కు తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. తుండాపై ఆంసాట్, నకిలీ పాస్ పోర్టుల కేసులున్నాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ యువకుల్ని ఉగ్రవాదంపై ఆకర్షితుల్ని చేసి శిక్షణ కూడా ఇచ్చాడు కరీమ్ తుండా. 1998లో గణేష్ ఉత్సవాల్లో బాంబ్ బ్లాస్ట్‌కు ప్లాన్ చేశాడన్న అభివయోగాలు కూడా ఇతనిపై ఉన్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/