వైసీపీ నూతన ఎంపీ ఫై నాన్‌బెయిలబుల్‌ కేసు

వైస్సార్సీపీ పార్టీ నుండి రాజ్యసభ కు ఎన్నిలకైనా ఆర్‌. కృష్ణయ్యపై హైదరాబాద్‌లో నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు అయ్యింది. రౌడీలు, గూండాలతో బెదిరిస్తున్నారంటూ రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూకబ్జాతో పాటు హత్యకు యత్నించాడని ఆర్‌. కృష్ణయ్యపై పిర్యాదు చేసాడు. ఈ పిర్యాదు తీసుకున్న రాయదుర్గం పోలీసులు ఆర్‌ కృష్ణయ్యపై 447, 427, 506, 384 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. రీసెంట్ గా వైస్సార్సీపీ పార్టీ ఆర్.కృష్ణయ్య ను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఆర్.కృష్ణయ్య రాజకీయ ప్రస్థానం చూస్తే.. 2014లో తెలుగుదేశం పార్టీలో చేరి, ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ పై 12525 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారి చట్ట సభల్లోకి అడుగుపెట్టాడు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీడీపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరి మిర్యాలగూడ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. ఉప ఎన్నిక‌లు జ‌రిగిన స‌మ‌యంలో అధికార టీఆర్ ఎస్‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. 2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగా వైసీపీకి మ‌ద్ద‌తుగా ఏపీలో ప్ర‌చారం చేశారు.