శ్రీశైలంలో పిస్టల్ తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీశైలం వన్ టౌన్ పీఎస్ లో విషాదం చోటు చేసుకుంది. శ్రీశైలం వన్ టౌన్ పీఎస్ లో శంకర్ శ్రీశైలం అనే కానిస్టేబుల్ పిస్టల్ తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ ప్రసాద్ రావు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ… శ్రీశైలంకు వెళ్తున్నానని, అక్కడకు వెళ్లిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. శంకర్ సూసైడ్ తో అక్కడ విషాదకర వాతావరణం నెలకొంది.

2000 సంవత్సరం బ్యాచ్ కు చెందిన శంకర్ రెడ్డి ఆత్మహత్యకు కుటుంబ సమస్యలా…ఆర్థిక సమస్యలా, దుర్వ్యసనాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నందికొట్కూరు మండలం దామగట్లకు చెందిన శంకర్ రెడ్డి అవివాహితుడు. కర్నూలు కృష్ణానగర్ లో నివాసముంటున్నాడు. ఇటీవలే నంద్యాల జిల్లాకు బదిలీ చేయించుకున్న శంకర్ రెడ్డి..అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.