ముగిసిన నాయిని అంత్యక్రియలు

పాడె మోసిన మంత్రులు కెటిఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌

minister-ktr-attends-nayini-narsimha-reddy-funerals

హైదరాబాద్‌: తెలంగాణ మాజీ హోంమంత్రి, టిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు నాయిని న‌ర్సింహారెడ్డి అంత్య‌క్రియ‌లు జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్థానంలో ముగిశాయి. ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో నాయిని అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జ‌రిపి నివాళుల‌ర్పించారు. నాయినిని క‌డ‌సారి చూసేందుకు టిఆర్ఎస్ శ్రేణులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. నాయిని అంత్య‌క్రియ‌ల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి హోంమంత్రిగా విశేష సేవలు అందించిన నాయిని ఇక లేరన్న నేపథ్యంలో సిఎం కెసిఆర్‌ కుటుంబంలోనూ తీవ్ర విచారం నెలకొంది.

ఈ క్రమంలో, మంత్రి కెటిఆర్ తమ ప్రియతమ నేత అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించారు. మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కాగా, మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్ గౌడ్ పాడె మోశారు. ఆ త‌ర్వాత ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు నాయిని పాడె మోసి నివాళుల‌ర్పించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/