పార్వతీదేవియే గౌరమ్మ

దేవీశరన్నవరాత్రుల అలంకారాల విశిష్టత

Batukamma pooja
Batukamma pooja

బతుకమ్మ పండుగకు సంబంధించి సమాజంలో ఎన్నో కథలున్నాయి. అందులో కొన్ని
చోళదేశాన్ని ధర్మాంగుడనే చక్రవర్తి పరిపాలిస్తుంటాడు.

అయితే అతని భార్య ఆయనటువంటి సత్యవతి నూరు నోములు నోచి నూరుగు (100మంది) సంతానాన్ని పొందింది. కానీ ఆ నూరుమంది కూడా శతృవుల చేతుల్లో చనిపోతారు. ఘోరాన్ని భరించలేనటువంటి ఆ యిద్దరు దంపతులు అడవికెళ్లి, ఆ అడవిలో ధర్మాంగుడు తపస్సు చేస్తుండగా లక్ష్మిదేవి కనిపించి, సాక్షాత్కరించి ఏంకావాలో కోరుకోవరమిస్తానని అనగా ధర్మాంగుడు తమకు కూతురి గా లక్ష్మిదేవి కావాలంటాడు.

అంతట లక్ష్మిదేవి సత్యవతి గర్భంలో చేరి కూతురిగా జన్మించగా, అది తెలుసు కున్నటువంట వశిష్టామహాను భావులంతా అక్కడికి వెళ్లి ఆ బాలికను ‘బతుకమ్మ అని దివిస్తారు. ఆ విధంగా బతుకునిచ్చే తల్లిగా బతుకమ్మఅందరికీ చేరువయ్యింది. ఇక రానురాను అదే బతుకమ్మ పేరు శాశ్వతమయ్యింది.

ఆ తరువాత కాలంలో శ్రీహరి చక్రాండుగా వచ్చి ఆమెను వివాహం చేసుకోవడం, యుద్ధంచేసి శతృరాజులను ఓడించి, మాయం అయినటువట ధర్మాంగుడికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టడ, ప్రజలంతా కూడా సుఖంగా జీవిచడం జరిగింది. ఇది ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

పార్వదేవిని బతుకమ్మగా, గౌరమ్మగా పూజిస్తారు. అయితే దక్షయజ్ఞాంలో అవమానం పాలయినటువంటి పార్వతీదేవి ఆత్మాహుతి చేసుకోవడం వలన అక్కడున్న వారంతా ఏకకంఠంతో ‘బతుకమ్మ, బతుకమ్మా అంటూ రోధించారనీ, వారి రోధనలు విన్నాటువంటి పార్వతీదేవి వారిని కరుణిస్తే వారి మొర ఆలకిస్తూ మళ్లీ జన్మించిందనీ, అందుకే ఆరోజు నుంచి బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారనేది కూడా ఒక నమ్మకంగా ప్రజల్లో ఉండిపోయింది.

ఇంకొక చరిత్ర ఆధారంగా చూసినట్లయితే కాకతీయ రుద్రమదేవి తన దాయాదులైనటువంటి వారిపై యుద్ధం చేసి ఆ యుద్ధాంలో విజయం సాధించి రాజ్యానికే తిరిగివచ్చి పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించిందిన ఒక కథ కూడా వినికిడి.

అదేవిధంగా సాహతీవేత్తలు ఆనాటి రుద్రమదేవి కాలంనాటి బతుకమ్మ పండుగకు బాగా ఆదరణ వచ్చిదని అటువంటి అభిప్రాయాన్ని ఒక జాపదంగా పాడితే యుద్ధభూమిలో అజాతశత్రువు వెన్నుపోటు పోడవబోతే అప్పుడు ఒక స్త్రీ రుద్రమదేవిని కాపాడిందని అప్పుడు ఆ స్త్రీ రుమ్రదేవిని కాపాడినందుకుగాను ఆ మహిళలను ఒక దైవంగా భావించి పూజలు చేశారని, అలా జతుకమ్మ పుట్టిదని. ఇంకో కథ వ్యాప్తి చెందింది. ఇంకా వాసవీ కన్యకాపరమేశ్వరీకథ.

వదినలు అంతా కలిసి మరదలిని చంపిన కత. భూస్వాముల దార్జన్యాలకు ఎదురుతిరిగిన ఒక అబల స్త్రీ కథ ప్రచారంలో ఉన్నాయి. ఏదేమయినా బతుకమ్మ అంటే పూలతో పూలను పూజించే గొప్ప పండుగగా చెప్పుకోవచ్చు.

ఆంధ్రాప్రాంతంలో విజయవాడలోని కనకదుర్గాదేవి శరనఆత్రులు ఎంతో ఘనంగా జరుగుతాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/