లడఖ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పర్యటన

బిపిన్ రావత్, నరవాణెను కలిసిన రక్షణ మంత్రి

rajnath-singh-at-leh
Rajnath Singh arrives at Leh Airport, to visit forward areas along

లడఖ్‌: రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈరోజు లడఖ్‌ చేరుకున్నారు. ఆయనకు అక్కడ సైనిక అధికారులు స్వాగతం పలికారు. చీఫ్ డిఫెన్స్‌ స్టాఫ్ జనరల్‌ బిపిన్ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్ ఎంఎం నరవాణెను లేహ్‌లో రాజ్‌నాథ్‌ కలిసి మాట్లాడారు. రాజ్‌నాథ్ పర్యటన సందర్భంగా భారత ఆర్మీ టీ90 ట్యాంక్స్‌, ఎంబీపీ ఇన్ఫాంట్రీ సిబ్బంది సైనిక విన్యాసాలు ప్రదర్శించారు. రాజ్‌నాథ్‌తో పాటు బిపిన్ రావత్‌, ఎంఎం నరవాణె ఈ విన్యాసాలను చూశారు. భారత్‌లో జరిపిన చర్చల నేపథ్యంలో శాంతి కోసం అంటూ చైనా సైన్యం ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల నుంచి కొన్ని కిలోమీటర్ల మేరకు వెనక్కి వెళ్లిపోయింది. కాగా రాజ్‌నాథ్‌ సింగ్‌ రెండో రోజలు పాటు క్షేత్రస్థాయి పరిశీలన, సైనిక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం ఆయన శ్రీనగర్‌కు కూడా‌ వెళ్లి  పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. ఇటివల ప్రధాని మోడి కూడా లడఖ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/