బీఆర్ఎస్ లోకి నాగం జనార్ధన్ రెడ్డి?

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి..పార్టీ కి రాజీనామా చేసి , బిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు వినికిడి.నాగర్ కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మరో రెండు మూడు రోజుల్లో బీఆర్ఎస్ లో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ తో నాగం జనార్ధన్ రెడ్డి భేటీ అవుతారని సమాచారం. తమ పార్టీలోకి రావాలని మంత్రి కేటీఆర్ ఆహ్వానించనున్నారట. జనార్ధన్ రెడ్డి త్వరలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. నాగర్ కర్నూల్ టికెట్ రాజేశ్ రెడ్డికి కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. అప్పటి నుంచి నాగం తీవ్ర నిరాశలో ఉన్నారు. కాంగ్రెస్ లో టికెట్ రానివారంతా బీఆర్ఎస్ లోకి, బీఆర్ఎల్ లో టికెట్ రానివారంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడారు.