రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈమేరకు రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ‘మోడీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో లోక్‌సభ సెక్రటేరియట్ ఈ నిర్ణయం తీసుకుంది.
తాజాగా రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్దరణ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాహుల్ పై అనర్హత వేటు ను తొలగిస్తూ బులిటెన్ విడుదల చేశారు పార్లమెంట్ సెక్రటరీ జనరల్. లక్షదీప్ కు చెందిన “నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ” (ఎన్.సి.పి)ఎమ్.పి మహమ్మద్ ఫైజల్ విషయంలో కూడా సభ్యత్వ పునరుద్దరణ నెలపైగానే జాప్యం అయింది. కానీ రాహుల్ విషయంలో స్పీకర్ ఓం బీర్లా పాజిటివ్ గా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాహుల్ పై అనర్హత వేటు ను తొలగిస్తూ బులిటెన్ విడుదల చేశారు పార్లమెంట్ సెక్రటరీ జనరల్.