నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో గులాబీ బాస్ పర్యటన

ఎన్నికల ప్రచారం లో భాగంగా గులాబీ బాస్ కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ పేరుతో జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మరోసారి బిఆర్ఎస్ ను గెలిపించాలని కోరగా..నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి 1.40 గంటలకు కోదాడ చేరుకుని 1.50 గంటలకు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం 2.30 గంటలకు సీఎం కేసీఆర్ కోదాడ నుంచి బయలుదేరి తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరికి చేరుకుని అక్కడ మధ్యాహ్నం 3.10 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి 4.10 గంటలకు ఆలేరు చేరుకుంటారు. ఆలేరులో సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ నెల 31వ తేదీన సీఎం కేసీఆర్ మరో మూడు నియోజకవర్గాలైన హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో పర్యటించి బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.