ఏపీ సినిమా టికెట్స్ వివాదం : వర్మ కు సపోర్ట్ పలికిన నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు..ఏపీ సినిమా టికెట్స్ ధరల విషయంలో వర్మ కు సపోర్ట్ పలికారు. సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. గత నాల్గు రోజులుగా సినిమా టికెట్ ధరల అంశం ఫై వర్మ స్పందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. పలు టీవీ ఛానెల్స్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొని ఈ టికెట్ ధరల విషయం తన నోటికి పనిచెపుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం వరుస ట్వీట్లతో ఏపీ ప్రభుత్వం మీద ప్రశ్నలు సంధించి ఓ వీడియో వదిలారు. ఈ ప్రశ్నల ఫై వైసీపీ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఈ తరుణంలో వర్మ ప్రశ్నలకు నాగబాబు సపోర్ట్ పలికారు.

“నువ్వు చెప్పింది అక్షరాలా నిజం… నేను ఏం అడగాలని అనుకున్నానో, ఆ ప్రశ్నలన్నీ నువ్వు అడిగావు వర్మా!” అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అంతేకాదు, వర్మ విడుదల చేసిన వీడియో తాలూకు ట్వీట్ ను కూడా తన పోస్టులో పొందుపరిచారు.

ఇక వర్మ అడిగిన ప్రశ్నలు ఓసారి చూస్తే..

ప్రశ్న నెంబర్ 1. ఒక వినియోదారుడికి, తయారుదారుడి మధ్యలో ఉన్న ప్రైవేట్ ట్రాన్సక్షన్ లో ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది.. ఎప్పుడైనా ఎమర్జన్సీ పరిస్థితిలో మాత్రమే ప్రభుత్వం ఎంట్రీ ఇస్తుంది.. అలాంటి పరిస్థితి ప్రస్తుతం సినిమాలో ఎప్పుడు ఏర్పడింది? ..

ప్రశ్న నెంబర్ 2: ఒక సినిమా లేదా పంట ఏదైనా తయారు చేస్తున్నప్పుడు.. దానికి సరైన ధర తిరిగి రానప్పుడు.. అతనికి మోటివేషన్ పోతుంది. అప్పుడు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయి తక్కువ క్వాలిటీ లో ప్రజలకు ప్రోడక్ట్ ఇస్తారు.. మీరు దానికి ఏ విధంగా జస్టిఫికేషన్ ఇస్తారు.. .

ప్రశ్న నెంబర్ 3: సినిమా అనేది నిత్యావసర వస్తువు .. ప్రజలకు అవసరసం అవుతుందని అనుకున్నప్పుడు.. దానిని ప్రభుత్వం అన్నిటి సబ్సిడీ ఇచ్చినట్లు .. ప్రొడ్యూసర్ కి ససబ్సిడీ చేయమంటున్నారు.. ఇది నా ఫీలింగ్ కాదు మీ ఫీలింగ్ అంటున్న రాము

ప్రశ్న నెంబర్ 4: రేషన్ షాపుల్లో ఉత్పత్తిదారుల వద్ద కొని వస్తువులను ఎలా తక్కువ ధరకు ఇస్తున్నారో .. నిర్మాతల వద్ద వారు చెప్పిన ధరకు ప్రభుత్వం సినిమాలను కొనుక్కుని.. రేషన్ షాఫుల్లాగే రేషన్ థియేటర్ లో సినిమా ఇవ్వమంటు..

ప్రశ్న నెంబర్ 5: ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ ఏమి కోరుకుంటున్నారో.. అదే ధరకు ప్రభుత్వం కొనుక్కుని అదే ధరకు లేదా ఇంకా తక్కువ ధరకు ప్రజలకు ఇస్తే.. మీ ఓట్లు మీకు వస్తాయి.. ఇదెలా ఉంది

ప్రశ్న నెంబర్ 6 : మీలో కొందరు సినిమా వ్యయం గురించి మాట్లాడుతున్నారు.. సినిమా వ్యయం రెమ్యునరేషన్ డిఫరెంట్ కాదు.. సినిమాకు పవన్, మహేష్ , నన్నో చూసి వస్తారు.. ప్రొడ్యూసర్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసి రెమ్యునరేషన్ ఇస్తారు.. దానిని ప్రశ్నించే హక్కు ఎవరీకి లేదు.. అది ఇచ్చి.. పుచ్చుకునేవారి మధ్య ఉండే హక్కు..

ప్రశ్న నెంబర్ 7: ప్రోమో బాగుంటుంది… సినిమా బాగుంటుందా అని అంటున్నారు.. వస్తువు రూపంలో కొంటే నచ్చక పోతే తిరిగి ఇచ్చేస్తారు.. అప్పుడు వస్తువు తిరిగి తయారుదారుకు వెళ్ళిపోతుంది.. టమాటా సగం తిన్నాక తిరిగి బాగోలేదు అన్నా.. ఫైవ్ స్టార్ హోటల్ లో బాగా తిని.. బాగోలేదు.. తిరిగి ఇచ్చెస్తామంటే ఎలా ఉంటుంది..

ప్రశ్న నెంబర్ 8 : నాది ఒక చిన్న సలహా.. మీరు మీ వారిని పెట్టి.. బాహుబలి కంటే.. గొప్ప గొప్ప వారిని పెట్టి.. సినిమా తీసి.. తక్కువ ధరలకు సినిమాలను అమ్మమంటూ…

ప్రశ్న నెంబర్ 9: చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా మాట్లాడుతున్నారు.. చిన్న సినిమాకు పదిమంది పనిచేస్తే.. పెద్ద సినిమాకు 1000 మంది పనిచేస్తారు.. దాని బట్టి వ్యయం అవుతుందని అన్నారు..

ప్రశ్న నెంబర్ 10: ఒక చిన్న హోటల్ లో ఇడ్లీ రూ.5 ఉండొచ్చు.. ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో అదే ఇడ్లి రూ. 500 ఉండొచ్చు.. ఇక్కడ కూడా పేదోడికి అందుబాటులో ఉండాలంటూ ఐదు రూపాయలకే అమ్మాలంటే ఎలా .. స్పెషాలిటీ అనేది వినియోగదారుడు గుర్తించాలి.. ఎవరైతే ఈ విషయంపై స్పందిస్తున్నారో వాళ్లకి అసలు సినిమా నిర్మాణం గురించి తెలుసా.. ఎవరైనా తప్పుదారి పట్టిస్తున్నారా .. ఇదే విషయంపై మిగతా సినిమా వారు కూడా స్పందించవచ్చు.. తన అనుమానాలకు ప్రభుత్వం సమాధానం చెప్పవచ్చు అని రామ్ చెప్పారు.

YouTube video