పాతబ‌స్తీ లో దారుణం : బాలిక ఫై ఆటో డ్రైవర్ అత్యాచారం

హైదరాబాద్ పాతబస్తీ లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నుండి బయటకు వచ్చిన బాలిక ను ఆటో డ్రైవర్ ఎత్తుకెళ్ళి అత్యాచారం చేయడమే కాకుండా ఆ బాలిక ను వ్యభిచార గృహంలో వదిలేసినా ఘటన పాత బ‌స్తీ కిష‌న్ బాగ్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

పాత బ‌స్తీ కిష‌న్ బాగ్ ప్రాంతానికి చెందిన ఒక బాలిక త‌న ఇంట్లో వాళ్లోతో గొడ‌వ ప‌డి న‌వంబ‌ర్ 20 న బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ తర్వాత ఆమె ఆచూకీ కనిపించలేదు. దీంతో బాలిక తల్లిదండ్రులు డిసెంబ‌ర్ 1 న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ కెమెరా ల ఆధారంగా ఆ బాలిక జాడను తెలుసుకున్నారు. ఓఇంటిపై దాడి చేసి అక్కడ ఉన్న బాలిక‌ను కాపాడారు. బాలిక ను నిర్బధించిన వారిని విచారంచ‌గా అసలు నిజం బ‌య‌ట ప‌డింది. నవంబ‌ర్ 20 బ‌య‌ట‌కు వ‌చ్చిన బాలిక‌ను ఒక ఆటో డ్రైవ‌ర్ స‌మీర్ తో పాటు అత‌ని స్నేహితుడు హ‌ఫీజ్ ఇద్ద‌రు క‌లిసి బాలికపై అత్యాచారం చేశారు. అంతే కాకుండా న‌గ‌రంలోని మైలార్ దేవ్ ప‌ల్లి లో మ‌రో ఇద్ద‌రు మ‌హిళల సాయంతో ఒక ఇంట్లో ఉంచి వ్య‌భిచారం చేయించారు. బాలిక‌కు మ‌త్తు మందు ఇచ్చి వ్య‌భిచారం చేయించార‌ని విచారణలో తేలింది.