అధికార మదంతో ప్రవర్తిస్తే పర్యవసానం అనుభవించాల్సి వస్తుంది – నాగబాబు

వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై జనసేన నేత , మెగా బ్రదర్ నాగబాబు విమర్శలు కురిపించారు. అధికార మదంతో ప్రవర్తిస్తే పర్యవసానం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని వైస్సార్సీపీ తెలుసుకోవాలని జనసేన పార్టీ నాగబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో వైస్సార్సీపీ vs జనసేన గా మారింది. పవన్ వైజాగ్ పర్యటన ను అడ్డుకోవడం , ఎయిర్ పోర్ట్ లో వైస్సార్సీపీ నేతలపై దాడి చేసారని జనసేన కార్య కర్తలను అరెస్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ ను సైతం హోటల్ కే పరిమితం చేయడం పట్ల పవన్ తో పాటు నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ సైతం వైస్సార్సీపీ నేతల ఫై పలు కామెంట్స్ చేయడం జరిగింది. దీనిపై వైస్సార్సీపీ నేతలు వరుస పెట్టి విమర్శలు చేయడం, పవన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం వంటివి చేస్తున్నారు.

ఇదిలా ఉంటె శుక్రవారం నాగబాబు మాట్లాడుతూ.. అధికారం శాశ్వతం కాదని వైస్సార్సీపీ తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. అధికార మదంతో ప్రవర్తిస్తే పర్యవసానం అనుభవించాల్సి వస్తుందన్నారు. స్కామ్‌లు, నేరాల నుంచి తప్పించుకోవడానికే..వైస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటోందని విమర్శించారు. ప్రజల బాగుకోసం జనసేన పార్టీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని చెప్పారు. జనసేన ఫైట్‌కు, వైస్సార్సీపీ ఫైట్‌కు చాలా తేడా ఉందని పేర్కొన్నారు.