బ్యాంకులకు వరుసగా ఆరు రోజులు సెలవులు

బ్యాంకులకు వరుసపెట్టి ఆరు రోజులు సెలవులు వచ్చాయి. దీపావళి సందర్బంగా దేశవ్యాప్తంగా అన్ని సంస్థలకు సెలవు ఉంటుంది. కొన్ని సంస్థలు రెండుమూడు రోజులపాటు సెలవులు ప్రకటిస్తే మరికొన్ని వారం రోజులపాటు సెలవులు ప్రకటిస్తాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో దీపావళి రోజు గ్రహణం ఉండడంతో పండుగను ఎప్పుడు చేసుకోవాలన్న దానిపై అంత గందరగోళం నెలకొంది. అయితే, ఈ విషయంలో జ్యోతిష్యశాస్త్ర నిపుణులు క్లారిటీ ఇచ్చారు. సోమవారమే జరుపుకోవాలని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు.

ఇదిలా ఉంటె బ్యాంకులకు మాత్రం వరుసగా ఆరు రోజులు సెలవులు వచ్చాయి. రేపు రెండో శనివారం కావడం సాధారణంగానే సెలవు రోజు. 23న ఆదివారం , 24న బ్యాంకులకు దీపావళి సెలవు, 25న లక్ష్మీ పూజ కారణంగా ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవు. 26న గోవర్థన్ పూజ కాబట్టి ఆ రోజున, 27న బైదూజ్/చిత్రగుప్త్ జయంతి కారణంగా ఆ రోజున కూడా బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. ఇలా మొత్తం ఆరు రోజులు సెలవులు వచ్చాయి. అయితే, ఈ ఆరు రోజుల సెలవులు దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తించవు. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శనివారం నుంచి 24వ తేదీ వరకు మూతపడతాయి.