సంగారెడ్డి లో ఘోరం.. మటన్ ముక్కలు వేయలేదని కొట్టి చంపిండు

సంగారెడ్డి లో ఘోరం.. మటన్ ముక్కలు వేయలేదని కొట్టి చంపిండు

ఈరోజుల్లో చిన్న చిన్న వాటికీ ప్రాణాలు తీస్తున్నారు. ముఖ్యంగా వేడుకల్లో సరిగా నాన్ వెజ్ వేయలేదని చంపడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యముగా పెళ్లి వేడుకల్లో పెళ్లి కొడుకు తరుపు వారికీ సరిగా నాన్ వెజ్ వేయలేదని గొడవకు దిగడం , కొట్టుకోవడం, ఆఖరికి చంపుకోవడం వంటి సంఘటనలు ఇప్పటికే వెలుగులోకి రాగా..తాజాగా మటన్ ముక్కలు వేయలేదని ఓ వ్యక్తి ని మరో వ్యక్తి చంపిన ఘటన సంగారెడ్డి లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

మంచిర్యాల జిల్లా అంకుశాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన 15 మంది కూలీలు సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ శివారులోని శ్రీసాయి బాలాజీ నర్సరీలో మామిడి మొక్కలకు అంటు కట్టేందుకు వచ్చారు. ఈ నెల 15న సాయంత్రం పని ముగించుకుని వారు ఉంటున్న రేకుల షెడ్డు వద్ద దావత్‌‌‌‌ చేసుకున్నారు. భోజనం టైంలో దయనేని శివ, గోస్కుల పాపన్న (37) ఇద్దరి మధ్య మటన్ ముక్కలు వేయలేదని గొడవ జరిగింది. ఈ క్రమంలో శివ ఇనుప పైపుతో పాపన్నను కొట్టాడు. తలకు బలమైన గాయం కాగా అతడిని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం పాపన్న మృతిచెందాడు.