ప్రజలకు సమాధానం చెప్పండి జగన్‌

సొంత ప్రయోజనాలకోసం రివర్స్ టెండరింగ్

ప్రజలకు సమాధానం చెప్పండి జగన్‌
Devineni Umamaheshwararao

అమరావతి: ఏపి ప్రభుత్వం టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులను ఏపి ప్రభుత్వం తెచ్చుకోలేకపోతోందని దేవినేని ఆరోపించారు. పోలవరం అంచనాలను సొంత ప్రయోజనాల కోసం రివర్స్ చేశారని ఆయన మండిపడుతూ ట్వీట్ చేశారు.’సొంత ప్రయోజనాలకోసం రివర్స్ టెండరింగ్ తో పోలవరం ‘అంచనాలు’ రివర్స్ చేశారు. చంద్రబాబు నాయుడు 2019 ఫిబ్రవరిలో 55,548 కోట్లకు టెక్నికల్ అడ్వైజరీకమిటీ(టీఏసీ) ఆమోదంతెస్తే, 28 మంది ఎంపీలుండి కూడా తెలుగు దేశం పార్టీ ఖర్చుపెట్టిన నిధులు తెచ్చుకోలేక కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టు పెడతారా? ప్రజలకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్’ అని దేవినేని ఉమ నిలదీశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/