హాస్పటల్ లో చేరిన నాగ శౌర్య

హీరో నాగ శౌర్య హాస్పటల్ లో చేరారు. కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొన్న శౌర్య..కళ్లు తిరిగిపడిపోయారు. దీంతో యూనిట్ సిబ్బంది హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం శౌర్య చికిత్స తీసుకుంటున్నాడు. నాగశౌర్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్స్ తెలిపారు. సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేవలం వైరల్ ఫీవర్ వల్ల అడ్మిట్ అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

నాలుగు రోజుల నుంచి ఉపవాసంలో ఉన్నప్పటికీ హీరో నాగశౌర్య ఫైటింగ్ సీన్స్ చేస్తున్నారని.. అందుకే కళ్లు తిరిగిపడిపోయారని వార్తలు వస్తున్నాయి. నాగశౌర్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. రీసెంట్‌గానే నాగ‌శౌర్య త‌న 24వ చిత్రాన్ని ప్రారంభించారు. ఎస్‌.ఎస్‌.అరుణాచ‌లం ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ప్రారంభ‌మైంది. ఆ సినిమా షూటింగ్‌లోనే నాగ‌శౌర్య పాల్గొంటున్నారు. శ్రీనివాస‌రావు చింత‌ల‌పూడి, డా.అశోక్ కుమార్ చింత‌ల‌పూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బేబీ అద్వైత‌, భ‌విష్య సినిమాకు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదిలా ఉంటె ఈ నెల 20నే నాగ‌శౌర్య పెళ్లి చేసుకోబోతున్నారు. రీసెంట్‌గా ఆయ‌న పెళ్లి తేదిని ఖరారు చేస్తూ అనౌన్స్‌మెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే. బెంగుళూరుకి చెందిన ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ అనూష శెట్టిని పెళ్లి చేసుకోబోతున్నారు.