ఆలస్యంగా వచ్చిన పుష్ప ట్రైలర్ పూనకాలు తెప్పించింది

ఆలస్యంగా వచ్చిన పుష్ప ట్రైలర్ పూనకాలు తెప్పించింది

పుష్ప అసలైన ట్రైలర్ వచ్చేసింది..నిజానికి ఈ ట్రైలర్ సోమవారం సాయంత్రమే రిలీజ్ కావాల్సి ఉండగా..టెక్నీకల్ ప్రాబ్లెమ్ రావడం తో కొద్దీ సేపటి క్రితం విడుదల చేసారు. ఇక ట్రైలర్ చూస్తే..భూమండలంలో ఎక్కడా పెరగని చెట్లు శేషాచలం అడవుల్లో పెరుగుతున్నాయి.. అక్కడి నుంచే వేల కోట్ల సరుకు విదేశాలకు స్మగ్లింగ్ అవుతుంది.. ఇది భూమిపై పెరిగే బంగారం.. ఎర్రచందనం అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో గంధపు చెక్కల స్మగ్లర్ పుష్పరాజ్ గా బన్నీ అదరగొట్టాడు. ఇక పోలీసులు జైళ్లో పెట్టి కట్టేసి చిత్రహింసలు పెట్టినా తన బాస్ ఎవరో చెప్పనని పుష్ప రాజ్ అనడం చూస్తుంటే.. అతను ఎవరి కిందో పని చేస్తున్నట్లు తెలుస్తుంది.

పల్లెటూరి అమ్మాయి శ్రీవల్లిగా రష్మిక మందన్నా సందడి చేసింది. ‘రంగస్థలం’ లో రామలక్ష్మి పాత్రను గుర్తు చేసింది. పుష్ప – శ్రీవల్లి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు అలరిస్తున్నాయి. సునీల్ – అనసూయ భరద్వాజ్ – అజయ్ ఘోష్ – ధనుంజయ లతో పాటుగా రావు రమేష్ – అజయ్ – శత్రు ఇందులో భాగమయ్యారు. ఇక ట్రైలర్ చివర్లో ‘పార్టీ లేదా పుష్పా’ అంటూ ఫహాద్ ఫాజిల్ మెరుపు తీగల కనిపించారు. ‘ఈ లోకం మీకు తుపాకీ ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవరి యుద్ధం వాళ్లదే..’ ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటూ బన్నీ చెప్పే డైలాగ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘పుష్ప: ది రైజ్’ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 17న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.