కార్తీ జపాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

తమిళ్ హీరో కార్తీ వరుస హిట్ల తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఏడాది ‘విరుమన్’, ‘Ps-1’, ‘సర్ధార్‌’ వంటి హ్యట్రిక్‌ హిట్లు అందుకున్నాడు. సర్దార్ మూవీ తెలుగు లో మంచి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే తన 25 వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కార్తీ. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుండగా, తెలుగు నటుడు సునీల్ ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. సునీల్ కి ఇది మొదటి తమిళ స్ట్రెయిట్ ఫిల్మ్. ఇటీవలే పూజా కారిక్రమాలు పూర్తి చేసిన మేకర్స్..సోమవారం ఫస్ట్ లుక్ ను విడుదల చేసి ఆసక్తి నింపారు. ఈ మూవీ కి జపాన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

పోస్టర్ బట్టి చూస్తే ఇది మాఫియా కామెడీ కథాంశంతో రాబోతున్నట్లు అర్ధమవుతుంది. ఈ మూవీలో కార్తీ జపాన్ అనే ఒక చలాకి డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కార్తీ ఈ పాత్రను పరిచయం చేస్తూ.. “జపాన్ మేడ్ ఇన్ ఇండియా. ఈ టిపికల్ రోల్ చేయడానికి చాలా ఎదురుచూస్తున్న” అంటూ ట్వీట్ చేశాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా , GV ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ మూవీ ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.