మళ్లీ మారిన ‘థాంక్యూ’ విడుదల తేదీ..

నాగ చైతన్య – మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ కలయికలో రాబోతున్న థాంక్యూ మూవీ మరోసారి రిలీజ్ డేట్ మారింది. వరుస హిట్ల తో ఫుల్ జోష్ లో ఉన్న నాగ చైతన్య..ప్రస్తుతం ‘థాంక్యూ’ మూవీ చేస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో దిల్ రాజు బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ లో చైతు కు జోడిగా రాశీ ఖన్నా తో పాటు ఈ సినిమా లో మాళవిక నాయర్ ఇంకా అవికా గౌర్ లు నటించారు..

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన టీజర్ సినిమా పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయగా రెండు పాటలు కూడా మంచి సక్సెస్ ను దక్కించుకుని సినిమా పై అంచనాలు పెంచాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో రెండు మూడు సార్లు ఈ సినిమా విడుదల చేయాలనుకుని వాయిదా వేయడం జరిగింది. ఇక జూలై 8న ఖచ్చితంగా విడుదల చేస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించడం తో ఈసారి పక్క అని అభిమానులు అనుకుంటూ వస్తున్నారు. కానీ మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్ ను జూలై 22 తేదీకి మార్చారు. కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా ను అన్ని కమర్షియల్ హంగులతో జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనను చూసిన అభిమానులు ఈసారైనా వస్తుందో లేదో అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా .. బీవీఎస్ రవి కథను అందించారు.

మూడు దశల్లో సాగే హీరో జర్నీ నేపథ్యంలో ఈ ప్రేమకథని దర్శకుడు తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా నాగచైతన్య ఇందులో హాకీ ప్లేయర్ గా సూపర్ స్టార్ మహేష్ వీరాభిమానిగా కనిపించబోతున్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ మూవీపై భారీగానే అంచనాలు పెంచేసుకున్నారు. ఇక ఈ మూవీ లో రాశిఖన్నా , మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్ లుగా నటించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ జూలై 8న రిలీజ్ కి రెడీ అవుతోంది.