బండ్ల ఇంటికి రేవంత్ రెడ్డి..కారణం ఏంటి..?

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఇంటికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చ గా మారింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన బండ్ల గణేష్ ..కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే 7ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని శపథం చేశారు. అయితే బ్యాడ్ లక్.. నాడు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ యాంటీగా చాలా మాటలు అన్న బండ్ల గణేష్ కాంగ్రెస్ ఓడిపోవడంతో ఇక మనస్థాపం చెందిన మొత్తం రాజకీయాలనే వదిలేశాడు.. రాజకీయాలకు తనకు సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు.

అప్పటి నుంచి ఇప్పటివరకూ అసలు రాజకీయాల మాట ఎత్తలేదు. తాజాగా ఈరోజు బండ్ల గణేశ్‌ నివాసానికి వెళ్లిన రేవంత్‌ రెడ్డి దాదాపు 2 గంటలపాటు ఆయనతో చర్చించారు. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. రేవంత్ అన్నతో తమ ఇంట్లో అద్భుతమైన సమావేశం జరిగిందని పేర్కొన్నారు. రేవంత్ అన్న నాయకత్వంలో పని చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ రాసుకొచ్చారు. అయితే క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న బండ్ల గణేశ్​ను .. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని రేవంత్ కోరినట్లు తెలుస్తోంది. మరి నిజంగా అదేనా..లేక మరోటా అనేది తెలియాల్సి ఉంది.